

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 125.56 పాయింట్లు (0.17 శాతం) నష్టపోయి 73,123.83 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 87.65 పాయింట్లు (0.39 శాతం) క్షీణించి 22,600 స్థాయికి పడిపోయింది. సెన్సెక్స్-30లో ట్రెంట్, టెక్ మహీంద్రా, బీఈఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు రిలయన్స్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్, ఎల్‌అండ్‌టీ, అపోలో హాస్పిటల్స్, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ-50లో శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.94.94 వద్ద స్థిరపడింది.