

‘గరివిడి లక్ష్మి’ బయోపిక్ కోసం ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్న, లైవ్ ఫోక్ ఆర్ట్ ప్రదర్శించడం చాలా సవాలుతో కూడుకున్నది. స్టేజ్ ఆర్టిస్టుల కష్టాలు చూశాక వారిపై గౌరవం మరింత పెరిగింది. ఆ పాత్రలో నా రియల్ లైఫ్ కనిపిస్తుందని చెబుతున్నది నటి ఆనంది. గ్లామర్ ఒక్కటే కాదు.. గుండెల్ని తాకే అభినయం కూడా తన సొంతమని నిరూపించుకున్న నటి ఆనంది గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు!
ఆనందికి ఇష్టమైన ఫుడ్?
నేను చాలా మితంగా తింట. డైట్ పేరుతో కష్టపెట్టుకోను. తమిళనాడు లోకల్ ఫుడ్‌ను బాగా ఎంజాయ్ చేస్త. అక్కడ స్థానికంగా లభించే జిగర్‌దండ, ఇడ్లీలు, నాన్-వెజ్ అంటే బాగా ఇష్టం.
నచ్చిన ప్రదేశం?
మాది తెలంగాణలోని వరంగల్. కానీ నాకు మధురై అంటేనే ఎక్కువగా ఇష్టం.
మీది ప్రేమ పెళ్లా?
లేదు, పెద్దలు కుదిర్చిన పెళ్లే. మా వారిపేరు సోక్రటీస్. మాకు ఒక బాబు. ఆయన మెరైన్ ఇంజనీర్. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
నచ్చిన రచయితలేవరైనా ఉన్నారా?
నా భర్త ఇంజనీర్ మాత్రమే కాదు. మంచి రచయిత కూడా. ఆయన సైన్స్ ఫిక్షన్స్ రాస్తుంటారు. తాను రాసే కథలు, నవలలు చదవడానికి ఎక్కువగా ఇష్టపడతా.
మీకిష్టమైన కోట్?
‘చిన్న చిన్న విషయాల పట్ల ఓపికగా ఉండటమే ఒక పెద్ద పనిని పరిపూర్ణం చేస్తుంది. ఇది నా ఫేవరెట్ కోట్.
తెలుగులోనేనా.. మరే ఇతర భాషాల్లోనైనా నటించారా?
తమిళం, తెలుగులో నటించా. తమిళంలో 25 సినిమాలకు పైగా చేశా. తెలుగులో ఎనిమిది సినిమాలు చేశా. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ‘పరియేరుమ్ పెరుమాళ్’. తమిళ సినిమాలో ఒక క్లాసిక్‌గా నిలిచింది. ఇది నాకిష్టమైన సినిమా. తెలుగులో జాంబి రెడ్ది ఇష్టం. రీసెంట్‌గా విడుదలైన గరివిడి లక్ష్మీ.
బయోపిక్‌లో నటించడం ఎలా అనిపించింది?
ఈ బయోపిక్ కోసం ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్న, లైవ్ ఫోక్ ఆర్ట్ ప్రదర్శించడం చాలా సవాలుతో కూడుకున్నది. స్టేజ్ ఆర్టిస్టుల కష్టాలు చూశాక వారిపై గౌరవం మరింత పెరిగింది. మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో నా రియల్ లైఫ్ రిఫ్లెక్షన్స్. టోటల్ గా ఆ పాత్రలో నా రియల్ లైఫ్ కనిపిస్తుంది!.
మూవీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు?
అసలు యాక్టర్ అవ్వాలనే ఇంటెన్షన్ నాకు లేదు. మూవీ ఇండస్ట్రీలోకి వస్తానని అనుకోలేదు. నటి కావాలనే కోరిక లేదా ప్లాన్ ముందేమీ లేదు. దర్శకుడు మారుతి గారి వల్లే నేను ఈ స్టేజ్‌లో ఉన్నా.
సినీ ఇండస్ట్రీ గురించి?
సినిమా పరిశ్రమలో కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. ఇక్కడ ఎన్నో రకాల లెక్కలు, అంతర్గత రాజకీయాలు నడుస్తాయి. కొన్ని సందర్భాల్లో అసలు నేను ఈ ఇండస్ట్రీకి సరిపోనేమో అనే భావన కూడా కలిగింది.
ఆడపిల్లలకు మీరిచ్చే సలహా?
ఆడపిల్లలకు పెళ్లి, కేరీర్‌కు ముగింపు కాదు. లైఫ్‌ను పర్సనల్ అండ్ కెరీర్‌కి ఇబ్బంది లేకుండా సెట్ చేసుకోవాలి. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లైతే అవకాశాలు తగ్గిపోతాయనేది ఉట్టి భ్రమ, అపోహ మాత్రమే.
వైవిధ్యపాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆనంది... గరివిడి లక్ష్మి బయోపిక్ తో మరోసారి సంచలనానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం తను పడ్డ కష్టం... వ్యక్తిగత జీవితంలో ఇష్టాయిష్టాలు.