జైలర్​ 2లో 100 నిమిషాల ఫుటేజ్‌ కట్‌..!

రజినీ తాజా మూవీపై ఫ్యాన్స్ ఆందోళన
Jailer 2
Jailer 2
Published on: 

చెన్నయ్: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సీక్వెల్ సినిమా ‘జైలర్ 2’పై ఆసక్తికర అంశాలతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలయింది.  అభిమానులతో పాటు సినీప్రియులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్‌–నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.  ట్రైలర్‌కు కూడా విశేష స్పందన లభించింది. అయితే సెన్సార్‌ విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 భారీగా కట్

సినిమాకు సంబంధించిన ఫుటేజ్‌లో ఏకంగా 100 నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు సమాచారం. ఒరిజినల్‌ ఫుటేజ్‌ 2 గంటల 45 నిమిషాల నిడివి ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనల్‌ ఎడిటింగ్‌లో కొన్ని పెద్దపెద్ద సన్నివేశాలకు భారీగా కట్ పడిందని ప్రచారం సాగుతోంది.

 అభిమానుల్లో చర్చ

సుమారు 100 నిమిషాల ఫుటేజ్‌ను తొలగించి, మిగిలిన కంటెంట్‌తోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారా? లేక మళ్లీ మార్పులు చేర్పులు ఏమన్నా చేస్తారా? అనేది అభిమానుల మధ్య నడుస్తున్న చర్చ. ఎడిటింగ్‌లో అవసరం లేని సన్నివేశాలను తొలగించడం ప్రతి సినిమాకు సాధారణమే. కానీ ఏకంగా గంటకు పైగా ఫుటేజ్‌ తొలగించారనే ప్రచారం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది.