

- పోయేటప్పుడు ఏం తీసుకెళతాం?
- మరణానికి ముందు పాటేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: చనిపోవడానికి నాలుగు రోజుల ముందు నానా పాటేకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 4న గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. “నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు” అంటూ వ్యాఖ్యానించారు. గోవాలోని సమ్రాట్ ఇంటర్నేషనల్ క్లబ్లో అక్టోబర్ 4న రాజశ్రీ ఖాండేపార్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నానా పటేకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘మనం వెళ్లిపోయేటప్పుడు ఏం తీసుకెళ్లగలం? జీవించి ఉన్నన్ని రోజులు సేవ చేయాలి. ఇదే నిజమైన జీవితం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
చితికి కట్టెలు సిద్ధంగా ఉంచుకున్నా ..
గతంలో పాటేకర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 2023లోనే ఆయన మరణం, అంత్యక్రియల గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ‘నా దహన సంస్కారాలకు 12 మణుగుల కట్టెలను (ఒక్క మణగు అంటే 40 కిలోలు) సిద్ధంగా ఉంచుకున్నాను. నన్ను తడి కట్టెలతో దహనం చేయొద్దు.. నేను సిద్ధం చేసుకున్న ఎండిన కట్టెలనే ఉపయోగించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ‘తడికట్టెలు ఉపయోగిస్తే పొగ ఎక్కువగా వస్తుంది.. అంత్యక్రియలకు వచ్చిన స్నేహితులు, ఇతరుల కళ్లలో ఆ పొగ కారణంగా నీళ్లు రావొచ్చు. అలా కళ్ల నుంచి నీళ్లు వస్తే.. వారు తన కోసం ఏడుస్తున్నారని నేను అపార్థం చేసుకొనే అవకాశం ఉంది’ అంటూ చమత్కరించారు.
కనీసం చనిపోయే సమయంలోనైనా ఎలాంటి అపార్థం ఉండకూడదని వ్యాఖ్యానించారు. ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా ప్రమోషన్ సందర్భంగా 2023 సెప్టెంబర్లో ఇంటర్వ్యూలో నానా పటేకర్ ఈ కామెంట్లు చేశారు. మనిషి ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపోవాల్సిందేనని తనకు తెలుసని.. తన చివరి ఆస్తి 12 మణుగుల కట్టెలేనని పేర్కొన్నారు. మనుషులు శాశ్వతంగా జీవిస్తామన్నట్టు వస్తువులు కూడబెట్టుకుంటారని.. ఇలా చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.