హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమా సూపర్ ప్లాప్

సినిమా చరిత్రలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా డిగ్గర్ చిత్రం
Tom Cruise’s ‘Digger’ Movie
Tom Cruises Digger Is a Box Office Flop In Film History
Published on: 

లాస్‌ఎంజిల్స్: హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ కథానాయకుడిగా, ఆస్కార్ అవార్డు విజేత అలెజాండ్రో జి ఇనారిటు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన తాజా చిత్రం 'డిగ్గర్'. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది. వీక్ స్టోరీ, మందకొడిగా సాగే కథనం, పేలవమైన దర్శకత్వంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.

 భారీ నష్టాల దిశగా చిత్రం

ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 మిలియన్ డాల్టర్లు మాత్రమే రాబట్టింది. అందులో అతిపెద్ద మార్కెట్ అయిన నార్త్ అమెరికాలో కేవలం 8 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు కావడం గమనార్హం. ఈ సినిమా నిర్మాణం కోసం అంచనా ప్రకారం 140 నుండి 180 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేశారు. అలానే ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్స్, మార్కెటింగ్ కోసం మరో 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారట మేకర్స్. ఇంతటి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు నిరాశాజనకంగా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు.

 గరిష్ఠ నష్టాల రికార్డు

ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం 'డిగ్గర్' రూపంలో వార్నర్ బ్రదర్స్ సంస్థకు దాదాపు రూ.1,350కు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో నష్టాలు చవిచూడటంతో హాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యంత భారీ పరాజయం పొందిన చిత్రాల జాబితాలో డిగ్గర్ చిత్రం చేరింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న స్టార్ నటుడు టామ్ క్రూజ్‌కు వరుసగా ఇది మూడోసారి నిరాశాజనక ఫలితమనే చెప్పాలి.