

చైనా: టిబెట్‌లో గురువారం రాత్రి భారీ భూంకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతిచెందారు. 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులు వివరాలను వెల్లడించారు. “రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.0గా నమోదైంది. భూంకంపం ధాటికి 300 ఇండ్లకు పైగా ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భారీ భూంకంపం వల్ల దేశవ్యాప్తంగా విద్యుత్, టెలికాం సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది” అని అధికారులు తెలిపారు. కాగా, చైనాలో భూకంపాలు రావడం సాధారణమే అయినప్పటికీ, గురువారం సంభవించిన భూకంపం 2024 జనవరి తర్వాత ప్రధాన భూభాగ చైనాలో నమోదైన అత్యంత శక్తివంతమైనదిగా చెబుతున్నారు. 2025 జనవరిలో టిబెట్‌లోని గ్రామీణ టింగ్రి కౌంటీలో 6.8 తీవ్రతతో కూడిన భారీ భూకంపం సంభవించడంతో 126 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.