మనసుకు నచ్చిన తోడు!

221 డేట్స్ విఫలం.. నాలుగు నిశ్చితార్థాలు రద్దు! అయినా ప్రేమపై నమ్మకం కోల్పోని బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్ హోడ్.. తన ఆరేళ్ల గోల్డెన్ రిట్రీవర్ లోగన్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది.
Elizabeth Hoad marries her dog Golden Retriever
British Woman Elizabeth Hoad marries her dog Golden Retriever
Published on: 

ప్రేమలో ఎన్నిసార్లు విఫలమైనా.. ప్రేమపై నమ్మకం కోల్పోలేదామె. 221 డేట్స్ విఫలం.. నాలుగు నిశ్చితార్థాలు రద్దు! అయినా ప్రేమపై నమ్మకం కోల్పోని బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్ హోడ్.. తన ఆరేళ్ల గోల్డెన్ రిట్రీవర్ లోగన్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. జీవితంలో ఎన్నోసార్లు ప్రేమలో విఫలమైన ఎలిజబెత్‌కు తన పెంపుడు కుక్క లోగన్ ఎంతో దగ్గరైంది. మనుషుల నుంచి ఆశించిన ప్రేమ దక్కకపోయినా, లోగన్ చూపించే నిస్వార్థమైన ప్రేమ, విశ్వాసం ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చాయి.

దీంతో తనకు అత్యంత ప్రియమైన లోగన్‌ను అత్యంత వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే ఇది చట్టబద్ధమైన వివాహం కాదు. ITV This Morning అనే టీవీ షో కోసం జరిగిన తంతు మాత్రమే. ప్రేమ అంటే మాటలు చెప్పడం మాత్రమే కాదు.. కష్టసుఖాల్లో తోడుగా ఉండటం కూడా అన్నది ఎలిజబెత్ అభిప్రాయం. ఈ కార్యక్రమం ప్రసారమై చాలా ఏళ్లు గడిచినా... ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది.