షమోండా వైరస్: ఫ్రాన్సులో తొలి కేసు నమోదు

ఇప్పటివరకు కేవలం జంతువులలో మాత్రమే కనిపించిన షమోండా వైరస్, ఇపుడు మనుషులకు కూడా సోకడం కలకలం రేపుతోంది. తమదేశంలో మొట్టమొదటి షమోండా కేసు నమోదయిందని ఫ్రాన్స్ ప్రకటించింది.
First Ever Human Case Of Shamonda Virus in France
First Ever Human Case Of Shamonda Virus in France
Published on: 

జంతువుల్లో మాత్రమే కనిపించే షమోండా వైరస్‌ ఇప్పుడు మనుషులకూ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తమ దేశంలో తొలి మానవ కేసు నమోదైనట్లు ఫ్రాన్స్‌ ప్రకటించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటంతో ఇన్ఫెక్షన్‌ తీవ్రరూపం దాల్చి, ఆ వ్యక్తి మరణించినట్లు వెల్లడించింది. మృతుడు నివసించిన పరిసర ప్రాంతాల్లోని పశువుల్లోనూ షమోండా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

షమోండా వైరస్ ప్రధానంగా పశువులు, గొర్రెలు, మేకలు, గుర్రాల వంటి జంతువులపై ప్రభావం చూపిస్తోంది. మిడ్జ్ అనే ఒక చిన్న ఈగ లాంటి కీటకం కాటు ద్వారా జంతువుల మధ్య వ్యాపిస్తుందని భావిస్తున్నారు.

1965లో తొలిసారి నైజీరియాలోని ప‌శువుల్లో ఈ వైర‌స్‌ను గుర్తించారు. దేని ప్రభావం వల్ల జంతువుల‌లో జ్వ‌రం, విరేచ‌నాలు, పాల ఉత్ప‌త్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటికి అబార్ష‌న్ లాంటి ఘ‌ట‌నలు జ‌రిగే అవ‌కాశం కూడా ఉంది. కొన్ని గుర్రాల్లో ఈ వైర‌స్ వ‌ల్ల నరాల సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు గుర్తించారు. ష‌మోండా వేరియంట్ వ‌ల్ల దీర్ఘకాలిక స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ప్ర‌పంచ జంతు ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది.

ష‌మోండా వైర‌స్ వ‌ల్ల మ‌నుషుల్లోనూ తీవ్ర స‌మ‌స్య‌లు ఉండే అవకాశం ఉంది. ఫ్రాన్స్ లోని లియాన్ న‌గ‌ర ఆస్ప‌త్రిలో చేరిన పేషంట్ లో ఇమ్యూన్ వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే, ఇది ఐసోలేటెడ్ కేసు అని, ఈ వైర‌స్ మ‌నుషుల్లో వ్యాప్తి అవ‌డం అరుదు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఓ కీట‌కం కుట్ట‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ జ‌రిగి ఉంటుంద‌ని ఫ్రెంచ్ అధికారులు భావిస్తున్నారు.

మొదటి మానవ రోగిలో ఇన్ఫెక్షన్ ఎలా సోకింది, వ్యాప్తి చెందే మార్గాలు, ప్రజారోగ్యానికి ఏవైనా అవకాశం ఉందా అనే కీలక విషయాలను గురించి అర్థం చేసుకోవడానికి సంబంధిత అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.