

బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక ఐఎమ్ఎఫ్ - వరల్డ్ బ్యాంక్ సమావేశాలలో ఏఐ భవిష్యత్తుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కృత్రిమ మేధ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని ఐఎమ్ఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని ఆమె ఎగిరేకారుతో పోల్చారు. ‘‘కారు స్పీడుకు బ్రేకులు కూడా ఉండాలి. అది ఎదురొచ్చే మనుషులను చంపకుండా చూడాలి’’ అని అన్నారు. ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జార్జియెవా మాట్లాడుతూ ‘‘ఎఐ ఎదుగుతున్న తీరును మరింత ప్రమాదకరంగా అభివర్ణించారు. ఏఐ రాకతో 10 శాతం ఉద్యోగాలలో మార్పులు వస్తాయని, రిసెర్చ్ ద్వారా దీనిపై మరింత స్పష్టత వచ్చింది’’ అని వెల్లడించారు.
ఉద్యోగాల కోతపై ఆందోళన
ఏఐ అభివృద్ది అనంతరం కొత్తగా వచ్చే సర్వీసు రంగ ఉద్యోగాలు గతంలో ఉన్నంతగా లేకపోయినా ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన తెలిపారు. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ టిఫ్ మక్లెం మాట్లాడుతూ ‘‘సాంకేతికత విషయంలోనూ విజేతలు, ఓడిపోయిన వారు ఉంటారు’’అని తెలిపారు. ‘‘నష్టపోయిన వారికి సరైన వ్యవస్థ ద్వారా అండగా నిలవాలని’’ సూచించారు. ప్రస్తుత ప్రపంచంలో విద్యుత్, డిజిటల్ నెట్‌వర్క్‌ల ప్రాధాన్యం గురించి వివరించారు. ఈ సమావేశంలో సైబర్ సెక్యూరిటీ, ఏఐ అసిస్టెంట్ పనితీరుపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. శాంతి ప్రదాత లాంటి ఏఐ సాంకేతికతను మానవాళికి ఉపయోగపడేలా చేయాలని నిపుణులు కోరారు. నియంత్రణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. నంబర్ వన్ టెక్నాలజీగా మారుతున్న ఏఐని శక్తిమంతం చేయడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సమావేశంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.