నవీ పిళ్లై ఎవరో తెలియదు

– నోబెల్ శాంతి పురస్కారం నాకే దక్కాలి – నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయం అవమానకరం – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Trump Slams Nobel Committee
Published on: 

వాషింగ్టన్: నోబెల్ శాంతి పురస్కారం దక్కకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రగిలిపోతున్నారు. పురస్కారానికి ఎంపికైన నవీ పిళ్లై ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించారు. ‘నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయం అవమానకరం. నార్వే దేశంపై చెరగని మచ్చ పడింది’ అంటూ వ్యాఖ్యానించారు. శనివారం న్యూయార్క్‌లోని సిరాక్యూస్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. నవీ పిళ్లై పేరు తాను ఇంతకుముందు ఎప్పుడూ వినలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమెకు అభినందనలు తెలిపారు. నోబెల్ శాంతి బహుమతిని ప్రజాస్వామ్య వ్యతిరేక, తీవ్రవాద భావజాలం కలిగిన కొందరు వ్యక్తులు అపఖ్యాతిపాలు చేశారని విమర్శించారు.

శాంతి పురస్కారంపై ట్రంప్ ఆశలు

రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు పెట్టుకున్నారు. తన ఆకాంక్షను పలుమార్లు బహిరంగంగా వ్యక్తం చేశారు. అయితే ఇరాన్‌తో యుద్ధం, గ్రీన్‌లాండ్‌పై అమెరికా వైఖరి, వలసదారుల విషయంలో కఠిన విధానాలు, అంతర్జాతీయ సహకార వ్యవస్థలపై విమర్శలు వంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారాయని నార్వేకు చెందిన నిపుణులు అభిప్రాయపడ్డట్టు సమాచారం.