

మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైననాటి నుంచి నల్ల సముద్రంలో రాకపోకలు సాగిస్తున్న చమురు నౌకలను లక్ష్యంగా చేసుకొని ఆ రెండు దేశాలు దాడులు చేస్తున్నాయి. మంగళవారం కూడా లైబీరియా జెండాతో వెళ్తున్న చమురు ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసింది. ఈ నౌకలో ఉన్న 23మంది భారతీయులను తమ ఆగ్నిమాపక సిబ్బంది రక్షించినట్లు రష్యా రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌కు చెందిన నౌకాదళానికి చెందిన సముద్ర డ్రోన్ ఈ దాడిచేసినట్లు తెలిపింది. ఈ దాడి సోచి నగరతీరంలో జరిగింది. అక్కడి సామాజిక మాధ్యమాల్లో దాడికి సంబంధించిన నల్లటి పొగ కమ్ముకున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ దాడి తర్వాత సోచి ప్రజలను బీచ్‌లు, సముద్ర తీరానికి దూరంగా ఉండాలని అక్కడి అధికార యంత్రాంగం హెచ్చరించింది. అంతకుముందు రోజే రోమానియన్ కోస్ట్ వద్ద ఒక నౌకపై దాడి జరిగి ఒకరి మృతిచెందగా, మరొకరు అదృశ్యమయ్యారు. ఈ దాడి రష్యానే చేసినట్లుగా ఉక్రెయిన్ ఆరోపించింది.