

అధికారం ఉంది కదా? అని విర్రవీగిన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌నకు ఆ దేశ ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. ఎంత బలంగా ఉన్నా, ప్రజల విశ్వాసం కోల్పోతే ఎలా ఉంటుందో రుచి చూపించారు. అమెరికా అధ్యక్షుడి పాలనకు రెఫరెండం లాంటి ‘మిడ్ టర్మ్’ ఎన్నికల్లో ట్రంప్ పాలనను ఓటర్ల తిరస్కరించారు. ఆయన నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ట్రంప్ మద్దతు పలికిన పలువురు అభ్యర్థులను ఓడించటమేగాక, రిపబ్లికన్ల రాష్ట్రాల్లో డెమొక్రాట్లకు పట్టం కట్టారు. దీంతో మంగళవారం జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ, సెనెట్, ప్రతినిధుల సభ రెండింటిలో మెజార్టీ సాధించింది. దీంతో ట్రంప్ డెమోక్రాట్లతో కలిసి పనిచేస్తానంటూ ప్రకటించాడు.
వాషింగ్టన్ : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్‌నకు ఘోర పరాభావం ఎదురైంది. ఆయన నేతృత్వం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థలను ఓటర్ల తిరస్కిరించారు. ట్రంప్ వీసా విధానాలు, ఇరాన్‌పై ఏకపక్షంగా సాగిన యుద్ధం, నిత్యావసర సరుకులు, ఇంధన ధరల సెగతో విసుగెత్తిన అమెరికన్లు ఆయా రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు విజయాన్ని కట్టబెట్టారు. దీంతో సెనెట్‌లో బలాబలాలు మారాయి. డెమోక్రాట్ల స్థానాలు 54కు పెరుగగా, రిపబ్లికన సభ్యుల సంఖ్య 44 స్థానాలకు తగ్గింది. ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల సంఖ్య 228కి, రిపబ్లికన్ల సంఖ్య 139కి చేరుకుంది. మెజార్టీ మార్క్ 218ని డెమోక్రాట్ పార్టీ అందుకుంది. 36 రాష్ట్రాల గవర్నర్ ఎన్నికల్లో 28 డెమోక్రాట్లు, 20 రిపబ్లికన్లు కైవసం చేసుకున్నాయి. రిపబ్లికన్లకు కంచుకోటలుగా భావిస్తున్న రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు పాగా వేశారు. కోట్లాది మంది ఓటర్లు తమ తీర్పు ద్వారా ట్రంప్ పాలనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దక్షిణ కరోలినా, టెక్సాస్, అయోవా వంటి సంప్రదాయ రిపబ్లికన్ రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు సత్తా చాటారు. ట్రంప్ ఆర్థిక విధానాలు, ఇరాన్‌పై యుద్ధ నిర్ణయం పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లకు కలిసొచ్చింది. ఫిబ్రవరిలో ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం పెరుగుదలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను ట్రంప్ నిర్వహిస్తున్న తీరుపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలు సర్వేల్లో ఈ అంశాలపై ఓటర్లు తమ అసంతృప్తిని స్పష్టంగా వెల్లడించారు. కాన్సాస్‌లో మెగా చర్చ్ పాస్టర్ ‘ఆడమ్ హామిల్టన్’ సెనేట్ స్థానాన్ని గెలుచుకున్నారు. దీంతో దాదాపు శతాబ్దం తర్వాత ఆ రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీకి సెనేట్ సీటు దక్కింది. ఒహాయోలో డెమోక్రటిక్ అభ్యర్థి షెర్రాడ్ బ్రౌన్ విజయం సాధించారు. రెండేళ్ల క్రితం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రాతినిధ్యం వహించిన స్థానం డెమోక్రాట్ల ఖాతాలో పడింది. మరోవైపు టెక్సాస్‌లో డెమోక్రటిక్ రాష్ట్ర ప్రతినిధి జేమ్స్ తలారికో, వివాదాల్లో చిక్కుకున్న రిపబ్లికన్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్‌పై విజయం సాధించారు.
రెండేండ్లలో తారుమారు
2024 ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ ట్రంప్ రెండంకెల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. ట్రంప్ 2024లో దాదాపు 18 శాతం ఓట్ల ఆధిక్యంతో గెలిచిన దక్షిణ కరోలినాలోనూ డెమోక్రాట్లు సంచలనం సృష్టించారు. డాక్టర్ ఆండ్రూస్ రిపబ్లికన్ అభ్యర్థి డార్లీన్ గ్రాహమ్‌పై విజయం సాధించారు. తన సోదరుడు, సెనేటర్ లిండ్సే గ్రాహమ్ మరణం తర్వాత ఆమెకు ఈ సీటు దక్కింది. తగిన రాజకీయ అనుభవం ఉన్న అభ్యర్థులను పక్కనపెట్టి, వివాదాలు, ప్రతికూలతలు ఉన్న కెన్ పాక్స్టన్, డార్లీన్ గ్రాహమ్లకు ట్రంప్ మద్దతు ప్రకటించడం కూడా రిపబ్లికన్లకు నష్టం కలిగించింది. పాక్స్టన్‌పై 2023లో అభిశంసన ప్రక్రియతో పాటు సెక్యూరిటీస్ మోసం ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గ్రాహమ్‌కు రాజకీయ అనుభవం తక్కువగా ఉండటం కూడా విమర్శలకు దారితీసింది. ఎన్నికలకు ముందు ట్రంప్ పాక్స్టన్, గ్రాహమ్‌తో పాటు ఒహాయోకు చెందిన జాన్ హస్టెడ్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. రెండు డజన్లకు పైగా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.
సెనెట్ డెమోక్రాట్లదే
సెనెట్‌లో డెమోక్రాట్లు మొత్తం 6 రిపబ్లికన్ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మిషిగన్, మిన్నెసోటా వంటి పోటీ తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో సొంత స్థానాలను నిలబెట్టుకోలేకపోయినా, సెనేట్‌లో మెజారిటీ సాధించే పరిస్థితి ఏర్పడింది. ప్రతినిధుల సభలోనూ డెమోక్రాట్లు కనీసం ఎనిమిది రిపబ్లికన్ స్థానాలను కైవసం చేసుకున్నారు. కెంటకీ, న్యూజెర్సీ, నార్త్ కరోలినా సహా పలు రాష్ట్రాల్లో విజయాలు నమోదు చేశారు. సంప్రదాయంగా రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చే నియోజకవర్గాల్లోనూ డెమోక్రాట్లు బలమైన ప్రదర్శన కనబర్చారు. దీంతో ప్రతినిధుల సభపైనా ఆ పార్టీ పట్టు సాధించే దిశగా ముందుకెళ్లింది. ఇతర ఎన్నికల్లోనూ డెమోక్రాట్లు ఆధిపత్యం ప్రదర్శించారు. టెక్సాస్ గవర్నర్‌గా మూడు పర్యాయాలు పనిచేసిన రిపబ్లికన్ నేత గ్రెగ్ అబాట్ ఓటమి పాలయ్యారు. డెమోక్రటిక్ అభ్యర్థి గినా హినోజోసా ఆయనపై విజయం సాధించారు. సంప్రదాయ రిపబ్లికన్ రాష్ట్రాలైన అయోవా, ఒహాయోలోనూ డెమోక్రాట్లు గవర్నర్ పదవులను కైవసం చేసుకున్నారు.
ట్రంప్ పాలనను తిరస్కరించారు: జాన్ ఒసాఫ్
‘అమెరికా ప్రజలు తమ అద్భుతమైన, నిర్ణయాత్మక తీర్పుతో అధ్యక్షుడు ట్రంప్ పాలనలోని అవినీతి, అసమర్థత, దిగజారుడుతనాన్ని తిరస్కరించారు’ అని జార్జియాలో విజయం సాధించిన డెమోక్రటిక్ సిట్టింగ్ సెనెటర్ జాన్ ఒసాఫ్ అన్నారు. డెమోక్రాట్లు మూడు ప్రతినిధుల సభ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో 2024లో ట్రంప్ కనీసం 9 శాతం పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించడం విశేషం.
ట్రంప్‌పై అసంతృప్తి.. సర్వేల్లో వెల్లడి
ప్రధాన అమెరికా టెలివిజన్ నెట్‌వర్క్‌లు, అసోసియేటెడ్ ప్రెస్ సహా పలు మీడియా సంస్థల తరఫున ఎస్ఎస్ఆర్ఎస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా ఓటు వేసిన వారిలో సగం మంది 2026 మధ్యంతర ఎన్నికలను అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేసే అవకాశంగా భావించినట్లు చెప్పారు. దేశం ప్రస్తుత దిశలో పయనిస్తున్న తీరుపై తాము ‘కోపంగా ఉన్నామని’ లేదా ‘అసంతృప్తితో ఉన్నామని’ దాదాపు 75 శాతం మంది ఓటర్లు వెల్లడించారు. అంతేకాకుండా, అధ్యక్షుడి అధికారాలపై నియంత్రణ ఉండేలా కాంగ్రెస్ మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ, సమతుల్యతను పాటించాలని 70 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు ట్రంప్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను, రిపబ్లికన్ పార్టీపై నెలకొన్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ ఓటమి..హైదరాబాద్‌లో సంబరాలు
ప్రభాత ఉదయం,హైదరాబాద్ సిటీ: ట్రంప్ నేతృత్వం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ ఓటమిపై హైదరాబాద్ సహా, పలు జిల్లాల వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజా ఎన్నికల ఫలితాల అప్ డేట్స్ తెలుసుకుని ట్రంప్ ఒంటెద్దు పోకడలకు తగిన శాస్తి జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లలో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికాబాట పట్టి.. అక్కడ నివసిస్తున్న వారి తల్లిదండ్రులు,స్నేహితులు,కుటుంబ సభ్యులు అమెరికా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల వీసా స్టాపింగ్ కష్టాలతో అమెరికాలో చదువుకుంటున్నవారు, విద్య అనంతరం ఓపీటీ పై చిరుద్యోగాలు చేస్తున్నవారితోపాటు హెచ్1 బి వీసాలు ఉన్న వారు సైతం సొంత గడ్డకు రాలేక అష్ట కష్టాలు పడుతున్నారు. నగరంతోపాటు పలు తెలంగాణ జిల్లాల్లో ఉన్న వారి తల్లిదండ్రులు ఈ విపరిణామంతో నిత్యం మనోవేదన చెందుతున్నారు. చావు బతుకుల్లో ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల చివరి చూపునకు సైతం తాము నోచుకోవడంలేదని అమెరికాలో ఉంటున్న పలువురు ఎన్ఆర్ఐలు వాపోతున్నారు. తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివాహాది శుభ కార్యాలకు కూడా తాము హాజరు కాలేకపోతున్నామని కొందరు తెలిపారు. ఇక్కడికి వస్తే అక్కడకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. అమెరికా వర్సిటీల్లో ఉన్నత చదువులు చదివేందుకు ఇండియాలో లక్షలాది రూపాయల బ్యాంకు లోన్లు తీశామని, ఉద్యోగం రాక అమెరికాను వీడాల్సి వస్తోందని మరికొందరు వాపోతున్నారు. అమెరికాలో తెలుగువారి కష్టాలు వర్ణనాతీతంగా మారడానికి ట్రంప్ విధానాలే కారణమన్నదే స్థూలంగా వీరందరి అభిప్రాయం. మధ్యంతర ఎన్నికల ఫలితాలతో అక్కడి పరిస్థితుల్లో మార్పు వస్తుందని మరికొందరు భావిస్తున్నారు.
ఫలితాలు
సెనెట్ ప్రతినిధుల సభ(మెజార్టీ 218) గవర్నర్ ఎలక్షన్
డెమోక్రాట్లు-54 డెమోక్రాట్లు-228 డెమోక్రాట్లు-28
రిపబ్లికన్లు-44 రిపబ్లికన్లు-139 రిపబ్లికన్లు-20