

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికకు తమ అభ్యర్థిగా కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురిని బీజేపీ ప్రకటించింది. ఈ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఆయన పేరుకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. 74 ఏళ్ల హర్దీప్సింగ్ ప్రస్తుతం పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పదవీకాలం నవంబరు 25న ముగియనుంది.
వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఈ అక్టోబర్లోనే అక్కడ 10 రాజ్యసభ స్థానాలకు పోల్స్ జరిగాయి. వీటిలో 8 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. స్థానిక రాజకీయ సమీకరణాల రీత్యా ఈదఫా అక్కడి నుంచి హర్దీప్సింగ్ను కమలదళం రీ నామినేట్ చేయలేదు. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ రాజీనామాతో ఇటీవలే మధ్యప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని ఆయనకు కేటాయించారు. ఈ స్థానానికి నవంబర్ 12న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.