

ముంబై : వొడాఫోన్ ఐడియా హక్కుల వాటాల జారీ వ్యవహారంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ.329 కోట్ల పన్ను డిమాండ్‌ను గురువారం న్యాయస్థానం కొట్టివేసింది.
2020 ఆర్థిక సంవత్సరంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్.. వొడాఫోన్ ఐడియా షేర్లను ఒక్కొక్కటి రూ.12.50 చొప్పున కొనుగోలు చేసింది. అయితే, ఆ షేర్ల మార్కెట్ విలువను రూ.13.925గా లెక్కించిన ఐటీ శాఖ.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణించింది.
అయితే, పన్ను పునఃపరిశీలనను నిర్ణీత గడువు ముగిసిన తర్వాత చేపట్టారని, ఈ కేసులో హక్కుల వాటాల కేటాయింపునకు సంబంధించిన పన్ను నిబంధనలను వర్తింపజేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌పై చేపట్టిన పన్ను చర్యలను రద్దు చేసింది.