‘ఏఐ’ లేఆఫ్‌లకు చెక్

సాంకేతికత నిఘా ఆధారంగా చేపట్టే కోతలపై నియంత్రణ చట్టం తీసుకొచ్చిన కాలిఫోర్నియా
layoffs
layoffs
Published on: 

కృత్రిమమేధ నిఘా ద్వారా ఉద్యోగులపై తీసుకునే క్రమశిక్షణ చర్యలు, ఉద్యోగ కోతలకు కాలిఫోర్నియా ప్రభుత్వం చెక్ పెట్టింది. తద్వారా ఈ తరహా చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఏఐని ఒక టూల్‌గా వాడుతూ ఉద్యోగుల పనితీరును అంచనా వేయడం, తద్వారా వారిపై వేటు వేయడం వంటి చర్యలను అడ్డుకునేందుకు ‘నో రోబో బాసెస్’ చట్టాన్ని తీసుకొచ్చినట్టు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ వెల్లడించారు. ఏఐ సాంకేతికత ఉద్యోగ అవకాశాలను విస్తరించాలి తప్ప, ఉద్యోగులు, వారి కుటుంబాలను రోడ్డున పడేయకూడదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ చట్టం కంపెనీల్లో ఏఐ వినియోగం, ఉద్యోగులను ఏఐతో భర్తీ చేయడం వంటి అంశాలను నియంత్రించదని న్యూసమ్ స్పష్టం చేశారు. అయితే, భారీ లేఆఫ్‌ల విషయంలో పారదర్శకత పాటించాలని పేర్కొన్నారు.

అంతేకాదు, ఉద్యోగుల బాత్రూమ్‌లపై ఏఐ ద్వారా నిఘా పెట్టడం, న్యాయవాదులు పూర్తిగా ఏఐపై ఆధారపడటాన్ని నియంత్రించడం వంటి అంశాలను కూడా ఈ చట్టంలో చేర్చడం గమనార్హం. కాగా, మెడికల్ లీవ్స్ తీసుకుంటున్న ఉద్యోగులపై ఏఐ ద్వారా నిఘా పెట్టి, వారిని మెటా కంపెనీ తొలగిస్తున్నట్టు ఇటీవల ఓ ఉద్యోగి ఆరోపించిన నేపథ్యంలో తాజా చట్టాన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది.