మోదీ, జ్ఞానేశ్ దిగిపోవడం ఖాయం

- కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
Congress MP Rahul Gandhi
Congress MP Rahul Gandhi
Published on: 

ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అధికారం నుంచి తప్పుకుంటుందని, ఆ తర్వాతే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఆయన పోస్ట్ పెట్టారు. పార్లమెంటులోని రాజ్యాంగ సదన్ సెంట్రల్ హాల్‌లో ఇండి కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించిన వీడియోను కూడా రాహుల్ షేర్ చేశారు.