లోయలో పడ్డ బస్సు.. 8 మంది భక్తులు మృతి

ఖాతుశ్యామ్ ఆలయ దర్శనానికి వెళ్తున్న యాత్రికుల బస్సు రాజస్థాన్‌లో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
Kota Mini Bus Falls Into 15 foot Drain In Rajasthan
8 Killed as Kota Mini Bus Falls into Drain in Rajasthan
Published on: 

జైపూర్​: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ఆలయ దర్శనానికి వెళ్తున్న ఓ బస్సు లోయలో పడి 8 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్​లోని బేతుల్​ జిల్లా ఘట్బిరోలి గ్రామానికి చెందిన 23 మంది రాజస్థాన్​లోని ఖాతుశ్యామ్​ ఆలయానికి బస్సులో బయల్దేరారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కోట జిల్లాలోని ఢిల్లీ–ముంబయి హైవేపై ఉన్న ఓ బ్రిడ్జిపై నుంచి 15 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. డ్రైవర్​ నిద్రమత్తులో ఉండడంతో బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, ఎమర్జెన్సీ బృందం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ 15 మందిని కోటా జిల్లా కేంద్రంలోని మెడికల్​ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్​ పీయూశ్​ సమారియా తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎ మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు.