భారత వైన్ మార్కెట్‌లోకి స్కాచ్ విస్కీ

భారత్‌-యూకే వాణిజ్య ఒప్పందంతో స్కాచ్‌ విస్కీ దిగుమతి సుంకాలు తగ్గినా, రాష్ట్ర పన్నులు, రవాణా ఖర్చుల వల్ల రిటైల్ ధరలు వెంటనే తగ్గకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Scotch whisky market
India–UK trade deal to make imported Scotch whisky cheaper
Published on: 

న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక విలువైన స్కాచ్ విస్కీ మార్కెట్‌గా అవతరించేందుకు సిద్ధమవుతోంది. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తరువాత దిగుమతి సుంకాలు 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గిపోయాయి. రానున్న పదేళ్లలో ఇది 40 శాతానికి పడిపోనుంది. దేశంలో ప్రీమియం బ్రాండ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో విదేశీ బ్రాండ్లు మన దేశంలోకి భారీగా వస్తున్నాయి. యూకే ఒప్పందంతో దేశంలో స్కాచ్ విస్కీ ధరలు తగ్గిపోతాయా..? మరి దేశీయ మద్యం మాటేమిటి..? విదేశీ మద్యంతో పోటీపడతాయా..?

స్థానిక తయారీదారుల ఆందోళన

విదేశీ మద్యానికి పోటీ ఇస్తున్న దేశీయ తయారీదారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశీయ వస్తువులపై రాష్ట్రాల పన్నుల భారం ఎక్కువగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ మద్యం రాకతో దేశీయ బ్రాండ్లకు నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను క్రమబద్ధీకరించాలని మద్యం వ్యాపారులు కోరుతున్నారు.

 ధరల తగ్గింపుపై ప్రభావం

అయితే, విదేశీ మద్యం దిగుమతులపై సుంకాలు తగ్గినంత మాత్రాన దేశంలో రిటైల్ ధరలు తగ్గిపోవంటున్నారు నిపుణులు ఈ అంశంపై ‘సీఐఏబీసీ బోర్డ్’ మెంబర్ అభిషేక్ మోడీ స్పందిస్తూ, "రాష్ట్ర పన్నులు, రవాణా ఖర్చులు, మార్జిన్లు వినియోగదారులు చివరిగా చెల్లించే మొత్తాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి" అని తెలిపారు. కాబట్టి సామాన్యుడి వద్దకు ఇప్పట్లో స్కాచ్ విస్కీ వచ్చే అవకాశం లేదని అంటున్నారు నిపుణులు.