నోయిడాలో అగ్నిప్రమాదం

నోయిడా సెక్టార్‌ 125 సమీపంలోని రాయ్‌పుర్‌ ప్రాంతంలో ఐదు తాత్కాలిక దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగి ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
Noida Sector 125 Fire Accident
Massive Fire Breaks Out at Noida Sector 125 Shops
Published on: 

నోయిడా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్‌ 125 సమీపంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయ్‌పుర్‌ ప్రాంతంలోని టీ, స్నాక్స్‌ విక్రయించే ఐదు తాత్కాలిక దుకాణాల్లో మంటలు చెలరేగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్​ అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. షాపుల నుంచి ప్రజలను ఖాళీ చేయించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఆర్పే క్రమంలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే హాస్పిటల్​కు తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

సిలిండర్లు పేలిన శబ్దాలు?

మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. షాపులు దగ్ధమవుతున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. సిలిండర్లు పేలిన శబ్దాలు వినిపించినట్లు మీడియా వైరల్​ కాగా, ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. అయితే, ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.