

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలను గడించాయి. 1109 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 73,034 వద్ద ముగిసింది. నిఫ్టీ 359 పాయింట్ల లాభంతో 22,722 వద్ద నిలిచిపోయింది. స్టాక్స్ ప్రారంభం నుంచి ఆయా కంపెనీలు షేర్లు పెరుగుతూ వచ్చాయి. తాజాగా వచ్చిన లాభాలు(రూ.5 లక్షల కోట్లు)కాగా, మొత్తం మార్కెట్ విలువ 470 లక్షల కోట్లకు చేరింది.
లాభాలకు కారణాలు
ఆర్బీఐ ఇటీవలే తీసుకున్న నిర్ణయంతో రూపాయి బలపడడం, ఆయిల్ ధరలు తగ్గుదల, ఐటీ స్టాక్స్ లాభాలతో ట్రేడవడం, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ), సెక్యూరిటీల లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ)లలో మార్పులు, బాండ్ యీల్డ్స్ తగ్గడం వంటివి భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ట్రేడవడానికి దోహదపడ్డాయి.
బలపడిన రూపాయి
విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో భారత రూపాయి విలువ బలపడింది. మంగళవారం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 0.5 శాతం లాభపడి 95.28 వద్ద ట్రేడయ్యింది.