కెప్టెన్ మచ్ఛార్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'కు ఎంపిక
Flydubai pilot smit machchhar
Israel to honour Indian pilot Smit Machchhar with top civilian bravery award
Published on: 

 ప్రభాత ఉదయం, న్యూఢిల్లీ : టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో పెను ప్రమాదాన్ని అడ్డుకుని, వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ క్యాప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. కాక్‌పిట్‌లో జరిగిన అనూహ్య పరిణామాలు దాడిని లెక్కచేయకుండా ఆయన చూపిన సాహసం, తెగువ దేశం మొత్తాన్ని విస్మయానికి గురిచేశాయని పలువురు పేర్కొన్నారు.

విమానంలో ఏం జరిగింది?

టెల్ అవీవ్ వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్ విమానం (FZ1073) గాల్లో ఉన్న సమయంలో కాక్‌పిట్‌లో అనుమానాస్పద దాడి మరియు ప్రమాదకర పరిస్థితి తలెత్తింది. తీవ్ర గాయాలపాలైనప్పటికీ, క్యాప్టెన్ స్మిత్ మచ్ఛర్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సాహస కృత్యం ద్వారా పెద్ద ప్రమాదం తప్పిందని, విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని ట్రేడ్ నిపుణులు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన అబుదాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 అధ్యక్షుడి చేతుల మీదుగా సత్కారం

జెరూసలేంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విమానంలో సహాయం అందించిన కొందరికి పతకాలు బహూకరించిన సందర్భంగా అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, క్యాప్టెన్ స్మిత్ మచ్ఛార్ సేవలను కొనియాడారు. క్యాప్టెన్ స్మిత్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇజ్రాయెల్ ప్రజల తరఫున ప్రతిష్ఠాత్మకమైన 'ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిల్ హీరోయిజం' అందజేసి ఘనంగా సత్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

 అభినందనల వెల్లువ

ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రయాణికులను కాపాడిన స్మిత్ మచ్ఛార్ ప్రతిభ అద్భుతమని, ఆయన దైర్యసాహసాలను ఇజ్రాయెల్‌లోని భారత రాయబారితో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు.