కాక్రోచ్ పార్టీకి అమెరికన్ల నిధులు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికాలోని కొందరు దాతల నుంచి నిధులు అందుతున్నాయని గాయని మేరీ మిల్‌బెన్ ఆరోపించారు. అయితే, తన వాదనకు ఆధారాలను వెల్లడించలేదు.
Mary Millben
Mary Millben alleged that the 'Cockroach Janata Party' is receiving funds from certain donors in the United States.
Published on: 

వాషింగ్టన్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి అమెరికాలోని కొందరు దాతల నుంచి నిధులు సమకూరుతున్నాయని ప్రముఖ గాయని మేరీ మిల్‌బెన్ (Mary Millben) ఆరోపించారు. భారత్‌లో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సర్‌ ప్రక్రియ, సీఈసీకు వ్యతిరేకంగా సీజేపీ, విపక్ష పార్టీలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో మేరీ మిల్‌బెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘అమెరికాలోని కొందరు దాతలు సంప్రదాయవాద భావాలు కలిగిన ప్రపంచ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. యూఎస్‌లో చదువుకుంటున్న విదేశీయులను ఎంపిక చేసుకుంటారు. వారిని తమకు అనుకూలంగా ప్రభావితం చేసి.. స్వదేశానికి పంపించి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తారు’ అంటూ మేరీ మిల్‌బెన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సీజేపీకి అమెరికా నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణకు సంబంధించిన ఏ ఆధారం ఆమె తన పోస్టులో ప్రస్తావించలేదు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేరును ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి బీజేపీని వ్యంగ్యంగా విమర్శిస్తూ చేసిన పోస్టులతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందారని Mary Millben ఆరోపించారు.

మోదీకి మద్దతు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మిల్‌బెన్ Mary Millbenమద్దతు తెలిపారు. భారత్‌లో పాలనకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పట్ల బాధ్యత కలిగిన యువత ముందుకు రావాలని అన్నారు. భారత్‌లో పుట్టి, పెరిగి, ఇక్కడే విద్యనభ్యసించిన యువత కొత్త నాయకత్వంతో ముందుకు రావాలని మిల్‌బెన్ సూచించారు.

మేరీ మిల్‌బెన్ గతంలోనూ పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగంగా మద్దతు తెలిపారు. 2023లో మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు భారత జాతీయగీతం ‘జనగణమన’ ఆలపించారు. అనంతరం మోదీ పాదాలకు నమస్కరించారు.

మణిపూర్‌ అంశంలోనూ ఆమె మోదీకి సపోర్ట్ చేశారు. జీ20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించాలన్న భారత్‌ ప్రతిపాదనను ప్రశంసించారు. 2024లోనూ మోదీని భారత్‌కు, భారత్‌-అమెరికా సంబంధాలకు అనుకూలమైన నాయకుడిగా అభివర్ణించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మద్దతు తెలపడమే కాకుండా, గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.