ఆమె కేంద్రమంత్రి.. ఈయన 'కాక్రోచ్' ప్రొటెస్టర్

ఎస్‌ఐఆర్‌ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్.. ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ ఢిల్లీలో నిరసనలో పాల్గొననున్నారు.
Economist Parakala Prabhakar
Economist Parakala Prabhakar
Published on: 

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త, ప్రముఖ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ అధికార ఎన్డీయే విధానాలను తప్పుపడుతున్నారు. కేంద్ర సర్కారు తీసుకువచ్చే ప్రతి నిర్ణయాన్ని ఆయన తరచూ విశ్లేషిస్తూ విమర్శలు సంధిస్తుంటారు. తాజాగా ఆయన ఎస్ఐఆర్ విధానానికి వ్యతిరేకంగా సీజేపీ పార్టీకి మద్దతిస్తూ రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు.

 నిరసనల బాటలో ఆర్థికవేత్త

ఢిల్లీలో నిర్వహించే నిరసన దీక్షలో పరకాల ప్రభాకర్ స్వయంగా పాల్గొననున్నారు. ఎస్‌ఐఆర్ విధానం ద్వారా కోట్ల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే ఆరున్నర కోట్ల ఓట్లు తొలగింపునకు గురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కులను కాలరాస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.