

- ప్రజలను చేరుకునేలోపే వాటిని అరికడదాం
- రక్షణ వలయాన్ని నిర్మించడానికి ఏకం కావాలని
-ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ
ప్రభాత ఉదయం, ఢిల్లీ: సైబర్ మోసాలు ప్రజలను చేరుకునే ముందే వాటిని అడ్డుకునేందుకు ప్రపంచ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సైబర్ నేరాలకు దేశాల సరిహద్దులు అడ్డంకి కావడం లేదని, డీప్‌ఫేక్‌లు పెద్ద సవాలుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్-2026 ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఒక దేశంలో ఉన్న వ్యక్తి, మరో దేశంలోని వ్యక్తి సహాయంతో మూడో దేశంలో నేరానికి పాల్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏఐ ఆధారిత నకిలీ కంటెంట్‌ను గుర్తించడం, దాని మూలాన్ని తెలుసుకోవడం కోసం అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. టెలికం, ఆర్థిక, ప్రభుత్వ నియంత్రణ సంస్థలు కలిసి సైబర్ మోసాలను మూలంలోనే అడ్డుకోవాలని మోదీ సూచించారు. సైబర్ మోసాలపై భారత్ నేర్చుకున్న విషయాలను ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు.
5జీ ప్రస్తావన
2022లో భారత్‌లో 5G సేవలను ప్రారంభించినప్పటి నుంచి దేశంలోని ప్రతి జిల్లాకు 5జీ చేరిందని మోదీ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 5.5 లక్షల 5జీ బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని, 2022తో పోలిస్తే మొబైల్ ఇంటర్నెట్ వేగం సుమారు 10 రెట్లు పెరిగిందని ఆయన స్పష్టం చేశారు.