

న్యూఢిల్లీ: టాటా గ్రూపులో వివాదం వేళ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ‘ఎక్స్’ వేదికగా బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టాటా గ్రూపును ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేరపూరితంగా నాశనం చేస్తున్నారు. కానీ, దేశంలోని ఏ వ్యాపారవేత్తా దీని గురించి మాట్లాడేందుకు సాహసించడం లేదు. ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటారు? చివరకు మిమ్మల్ని వారి ఆధీనంలోకి తీసుకునే వరకు వేచి చూస్తారా? భారతీయ వ్యాపార రంగం వారి(మోదీ, అమిత్‌షా) ఆటవస్తువు కాదు. ఈ నేరాలకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని రాహుల్ పేర్కొన్నారు. కాగా, టాటా గ్రూపు మాతృ సంస్థ టాటా సన్స్ బోర్డుకు, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ సెప్టెంబరులో టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. సంస్థను స్టాక్ మార్కెట్లో నమోదు చేయాలనే దిశగానూ అడుగులు వేసింది. ఈ రెండు నిర్ణయాలపై నోయెల్ టాటా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వివాదాల నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.