ఆత్మకథతో ఇన్‌స్టాలోకి సోనియాగాంధీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. తన ఆత్మకథ ‘‘బిలాంగింగ్‌- ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి వీడియోను షేర్‌ చేశారు.
Sonia Gandhi
Sonia Gandhi makes Instagram debut and shares first look of her book
Published on: 

 న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. త్వరలో విడుదల కాబోయే తన ఆత్మకథ ‘‘బిలాంగింగ్‌- ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి వీడియోను షేర్‌ చేశారు. ‘అందరికీ నమస్కారం.. నా ఆత్మకథ పుస్తకం తొలి రూపాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రేమ, బాధ్యత, నష్టం, చివరికి మనం ఎక్కడికి చెందినవారమనే భావనను కనుగొనడం వంటి అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ పుస్తకాన్ని మీతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పుస్తకం బరువుగా ఉందంటూ ప్రచురణకర్తలతో సోనియా సరదాగా మాట్లాడారు. ‘మీరు చాలా బరువైన భారాన్ని మోస్తున్నారు’ అని చమత్కరించారు. ఈ పుస్తకం తన కుటుంబంలోని మానవత్వానికి అంకితమని తెలిపారు. గత ఆరు దశాబ్దాలుగా భారత్‌లో తాను ప్రత్యక్షంగా చూసిన సామాజిక, రాజకీయ మార్పులపై తన అనుభవాలను ఇందులో ప్రత్యేక దృక్కోణంలో వివరించినట్లు వెల్లడించారు. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 10న విడుదల కానుంది.