భారత్‌కు వచ్చేయండి

అమెరికాలోని భారతీయ నిపుణులకు శ్రీధర్ వెంబు సూచన
Sridhar Vembu
Sridhar Vembu urges Indian IT professionals in US to return India
Published on: 

చెన్నై: అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులు స్వదేశానికి తిరిగి రావాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమెరికాలోని ఓ వర్గం.. భారతీయ నిపుణులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదని గుర్తు చేశారు. అమెరికాలోని పలు ఐటీ సంస్థలపై పీఈఆర్ఎం ఆంక్షలు విధించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రీధర్ వెంబు స్పందించారు. అమెరికా విధానాల్లో వస్తున్న మార్పులు, గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఎదురవుతున్న ఆంక్షలు భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతున్నాయని శ్రీధర్ వెంబు గుర్తు చేశారు.