

బిజినెస్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ రంగాల షేర్లు లాభాలను గడించాయి. సెన్సెక్స్ 1,533.72 పాయింట్లు (2.11 శాతం)తో 74,315.61 వద్ద ముగిసింది. నిఫ్టీ 374.65 పాయింట్లు (1.66 శాతం)తో 22,997.35 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30లో టెక్ మహింద్రా 4.8 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.9 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.4 శాతం లాభపడ్డాయి. భారతీ ఎయిర్టెల్, ఎటర్నల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు కూడా లాభాల్లో కొనసాగాయి. హిందుస్థాన్ యునిలీవర్, బీఈఎల్, ట్రెంట్ షేర్లకు నిరాశే ఎదురైంది.
లాభాలకు కారణాలు
చమురు ధరలు కొంతవరకు తగ్గడంతో మదుపరులు షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీయో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో తేదీలను ప్రకటించడం, క్రమంగా రూపాయి బలపడటంతోపాటు మరికొన్ని అంశాలు సూచీలు లాభాల్లో ట్రేడవ్వడానికి దోహదపడ్డాయన్నారు.
ఐదో రోజూ పెరిగిన రూపాయి విలువ
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.1 శాతం పెరిగి రూ. 95.04 వద్ద స్థిరపడింది.