ఈ జోడీ జర్నీ.. లాంగ్​ గురూ!

అమూర్ ఫాల్కన్ జాతికి చెందిన అపాపాంగ్, అలాంగ్ అనే రెండు పక్షులు 23 దేశాల మీదుగా 20,000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకుని తిరిగి మణిపూర్ చేరుకున్నాయి.
AMUR FALCONS
Amur falcons Apapang, Alang return to Manipur after crossing 23 countries
Published on: 

న్యూఢిల్లీ: హద్దులు లేని స్వేచ్ఛ అంటే ఇదే. అమూర్​ ఫాల్కన్​ జాతికి చెందిన అపాపాంగ్, అలాంగ్ అనే రెండు పక్షులు గత ఏడాది వ్యవధిలో ఏకంగా 23 దేశాల మీదుగా ప్రయాణించాయి. ఇవి దాదాపు 20వేల కిలోమీటర్ల సుదీర్ఘ జర్నీ చేశాయి. 2025 నవంబర్​ 11న మణిపూర్ నుంచి బయలుదేరిన ఈ పక్షులు,​ తాజాగా గురువారమే (2026 అక్టోబర్ 22న) ఈ రాష్ట్రంలోని తమెంగ్‌లాంగ్ జిల్లాకు తిరిగి చేరుకున్నాయి. వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) శాస్త్రవేత్తలు అపాపాంగ్, అలాంగ్​లకు అమర్చిన శాటిలైట్ ట్యాగ్‌లతో యావత్​ ప్రయాణాన్ని లైవ్​లో ట్రాక్​ చేశారు.

ఈవిషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ పక్షులు ఈశాన్య భారతదేశం నుంచి ఆఫ్రికాలోని సోమాలియా వరకు విరామం లేకుండా ఎగిరాయని తెలిపారు. ‘‘పక్షుల జోడీ ప్రయాణం విజయవంతం కావడం ఒక మైలురాయి. మణిపూర్​వాసులు పక్షులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు” అని కొనియాడుతూ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్​ చేశారు.