పండుగకు ఇంటికి వెళ్లడం లేదా?

పండుగల సమయంలో కుటుంబానికి దూరంగా ఉంటున్నారా? సొంతింటిపై బెంగ, ఒంటరితనం మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.
పండుగకు ఇంటికి వెళ్లడం లేదా?
commons
Published on: 

పండుగపూట ఫ్యామిలీతో కలిసి గడపడం, ఎంజాయ్ చేయడమనేది ఓ గొప్ప అనుభూతి. అయితే కొన్ని సందర్భాల్లో ఇంటికెళ్లడం కుదరకపోవచ్చు. ఈ పరిస్థితి మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో డాక్టర్ హమ్జా హుస్సేన్ వివరించారు.

పండుగల సమయంలో చాలామందికి తమ సొంత ఇంటిపై బెంగ (Homesickness) ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలని.. సంప్రదాయాలు, ఆత్మీయత, ఆనందం, ఒకరికొకరు దగ్గరగా ఉన్నామనే భావనలతో ముడిపడి ఉంటుంది. పండుగల సమయంలో ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, మనం ఎలా ఉండాలని ఆశిస్తున్నామో, వాస్తవంగా ఎలా అనుభూతి చెందుతున్నామో అనే రెండింటి మధ్య వ్యత్యాసం ఒంటరితనాన్ని మరింత పెంచుతుందని డాక్టర్ హమ్జా హుస్సేన్ చెబుతున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా నివసించే యువత, వలస వచ్చినవారు, కుటుంబ సభ్యులకు దూరంగా జీవిస్తున్న వ్యక్తులు ఈ పరిస్థితిని ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన వివరించారు. పండుగల సమయంలో ఒంటరి వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే?

డాక్టర్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒంటరితనం కేవలం భౌతికంగా ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. మనకు ముఖ్యమైన వ్యక్తులతో భావోద్వేగపరమైన అనుబంధం లేదనే భావన కూడా ఒంటరితనమే. ఒక వ్యక్తి చుట్టూ స్నేహితులు, సహోద్యోగులు ఉన్నప్పటికీ ఒంటరిగా అనిపించవచ్చు. మనకు ముఖ్యమైన కుటుంబ సభ్యులు, ఆత్మీయ వ్యక్తులతో ఎమోషనల్‌గా దూరమైనట్లు అనిపించినప్పుడు ఈ భావన కలుగుతుంది.

పండుగల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడపలేకపోవడం, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకురావడం, ఇంట్లో జరిగే వేడుకలకు దూరంగా ఉండటం వంటి అంశాలు మనసును ప్రభావితం చేయవచ్చు. అందువల్ల పండుగల సమయంలో కలిగే ఒంటరితనాన్ని కేవలం ఒంటరిగా ఉండటంతో పోల్చి చూడకూడదు. మనకు అర్థం చేసుకునే వ్యక్తులు, ఆత్మీయ సంబంధాలు ఎంత ముఖ్యమో గుర్తించాలి.