స్మృతిని హర్మనే నడిపించాలి

స్మృతి మంధాన కెప్టెన్సీలో హర్మన్‌ప్రీత్ కౌర్ అనుభవం జట్టుకు ఉపయోగపడేలా సహకరించాలని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ సూచించారు.
BCCI President Mithun Manhas
BCCI President Mithun Manhas
Published on: 

ప్రభాత ఉదయం, స్పోర్ట్స్ డెస్క్ :  టీమిండియా కెప్టెన్ గా కొత్తగా బాధ్యతలు తీసుకున్న స్మృతి మందానను హర్మన్ ప్రతీ కౌర్ ముందుండి నడిపించాలని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ సూచనలు చేశారు. కోహ్లీకి ధోని సహాయం చేసినట్టుగానే స్మృతికి హర్మన్ సహకరించాలన్నారు. అప్పుడే టీమిండియా విజయాల పరంపర కొనసాగుతుందని తెలిపారు. సీనియర్లు ఎప్పటికప్పుడు టీమిండియాకు సలహాలు ఇవ్వాలని, సమిష్టి కృషితోనే సక్సెస్ దక్కుతుందని పేర్కొన్నారు. కెప్టెన్సీకి దూరమైన హర్మన్ కు ఎప్పటిలాగే పవర్స్ ఉంటాయన్నారు. స్మృతికి హర్మన్ అనుభవం అవసరమని స్పష్టం చేశారు. తానే కెప్టెన్ అనే అహం స్మృతికి రావొద్దని సూచించారు.