ఉప్పల్‌ టీ20 మ్యాచ్‌.. కాంప్లిమెంటరీ పాసుల మాటున బ్లాక్‌ టికెట్ల దందా?

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా బుధవారం నిర్వహించే భారత్ - వెస్టిండీస్ టీ20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా టికెట్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
India vs West Indies T20 Match In Uppal Stadium
India vs West Indies T20 Uppal Stadium Balck Tickets Allegations
Published on: 

ప్రభాత ఉదయం, ఉప్పల్: హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా బుధవారం నిర్వహించే భారత్ - వెస్టిండీస్ టీ20  క్రికెట్ మ్యాచ్ సందర్భంగా టికెట్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అభిమానులకు ఆన్‌లైన్‌లో టికెట్లు దక్కడం కష్టంగా మారిన వేళ.. స్టేడియానికి చేరాల్సిన టికెట్లు కొందరు పోలీసుల చేతికి వెళ్లడం, వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ వ్యవహారంలో టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

40 వేల సామర్థ్యం.. 25 వేల టికెట్లే ఆన్‌లైన్‌లో!

ఉప్పల్‌ స్టేడియం సామర్థ్యం సుమారు 40 వేల మంది. హెచ్‌సీఏ వర్గాల సమాచారం ప్రకారం.. వీటిలో దాదాపు 25 వేల టికెట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో విక్రయించారు. మిగిలిన టికెట్లను కాంప్లిమెంటరీ పాసులు, వివిధ శాఖల కోటాల పేరుతో పక్కన పెట్టారు. ఈ వ్యవహారమే బ్లాక్ మార్కెటింగ్ దందాకు దారితీసిందని విమర్శలు వెల్లువెత్తాయి. దందాకు పాల్పడిన వారికి కొందరు అధికారుల అండదండలున్నాయని, పోలీసు అధికారుల బాధ్యతా రాహిత్యం కూడా కారణమని క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.