టీమిండియా, పాక్ మ్యాచ్‌లకు తగ్గిన ఆదరణ

India vs Pakistan cricket match
India vs Pakistan cricket match viewership decline
Published on: 

• పదేళ్లుగా భారత్ ఆధిపత్యం

• పస లేదు... 70 శాతం తగ్గిన వ్యూయర్ షిప్

ప్రభాత ఉదయం, స్పోర్ట్స్ : టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లపై జనాధారణ తగ్గినట్టు నివేదికలు చెబుతున్నాయి. గతంలో దాయాదుల పోరంటే, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తలపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలుస్తోంది. గడిచిన 10 ఏళ్లలో లెక్కలు పరిశీలిస్తే ఎక్కడ, ఎప్పుడు మ్యాచ్‌లు జరిగినా పాకిస్తాన్‌పై టీమిండియా పైచేయి సాధించింది. టీమిండియాకు తగ్గట్టుగా పాకిస్తాన్ సరైన ప్రదర్శన చేయకపోవడంతో మ్యాచ్‌లు వన్ సైడ్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా, పాక్ మ్యాచ్‌లకు క్రమంగా ఆదరణ తగ్గుతున్నట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దాయాదుల పోరులో పస లేకపోవడంతో దాదాపు 70 శాతం వ్యూయర్ షిప్ తగ్గిందని అంటున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ మొద్దు నిద్ర వీడకపోతే, పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

పదేళ్లలో టీమిండియానే పైచేయి

2016 నుంచి ఇప్పటి వరకు టీమిండియా, పాకిస్తాన్ మధ్య మొత్తం 19 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐసీసీ, ఆసియా కప్‌లలో మాత్రమే రెండు టీమ్స్ తలపడ్డాయి. ఈ క్రమంలో 19 మ్యాచ్‌లలో టీమిండియా 15 గెలవగా, పాకిస్తాన్ కేవలం మూడింటిలో మాత్రమే గెలిచింది. ఒకే ఒక్క మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అంటే పాకిస్తాన్‌పై టీమిండియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించిందని చెప్పవచ్చు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఇండియానే గెలుస్తుంది కదా? ఇంకెందుకు చూడడమని లైట్ తీసుకునేవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.

పాకిస్తాన్ దిగజారడానికి కారణాలు

పీసీబీ అధ్యక్షుడిగా మొహ్సిన్ నఖ్వీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పాకిస్తాన్ జట్టు పరిస్థితి దారుణంగా తయారైందని తెలుస్తోంది. పదే పదే కెప్టెన్లను మార్చడం, పలుకుబడి ఉన్న వాళ్లను ఎంపిక చేయడం, తరచు ప్లేయర్లు ఫామ్ కోల్పోవడం లాంటి కారణాల వల్ల  మంచి ప్రదర్శన రావడం లేదని అంటున్నారు. ఈ సమస్యలను గుర్తించి, పరిష్కరించడంలో నఖ్వీ విఫలమౌవుతున్నారని అంటున్నారు. నఖ్వీని మార్చి, షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది లాంటి వాళ్లకు పీసీబీ బాధ్యతలను అప్పగించాలనే డిమాండ్స్ పెరిగిపోతున్నాయి.