ఇండోర్‌లోనూ పరుగుల వరదే

టీమిండియా, విండీస్ జట్ల మధ్య ఆదివారం జరుగనున్న 3వ టీ20 కోసం ఇండోర్ స్టేడియం సిద్ధమైంది.
India vs West Indies Third T20 Match
India vs West Indies Third T20 Match
Published on: 

ప్రభాత ఉదయం :  టీమిండియా, విండీస్ జట్ల మధ్య ఆదివారం జరుగనున్న 3వ టీ20 కోసం ఇండోర్ స్టేడియం సిద్ధమైంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇప్పటికే రెండో టీ20లో ఓడిపోయి ఒత్తిడిలో ఉన్న టీమిండియా, ఎలాగైనా మూడో మ్యాచ్ గెలవాలన్న కసితో నెట్స్‌లో చెమటోడ్చుతోంది. మరో మ్యాచ్ గెలిచి సిరీస్ గెలవాలన్న మాస్టర్ ప్లాన్‌తో విండీస్ రెడీ అయింది.

బౌలింగ్‌పై గంభీర్ దృష్టి

టీమిండియా బౌలర్లు పెద్దగా రాణించకపోవడం, మంచు ప్రభావంతో రాంచీలో 250 పరుగుల టార్గెట్ పెట్టినా కరేబియన్లు ఊదిపారేశారు. ఇండోర్‌లోనూ  అదే పరిస్థితి ఉంటుందని గంభీర్ ముందే అలర్ట్ అయ్యాడు. శనివారమే బౌలర్లతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. మంచు పడితే ఎలాంటి బంతులు వేయాలి ? ఒకవేళ మొదట బౌలింగ్ చేయాల్సి వస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై గంభీర్ దిశా నిర్దేశం చేసినట్టు సమాచారం.

టీమిండియాలో భారీ మార్పులు చేసే ఛాన్స్

రెండో టీ20లో విఫలమైన శివమ్ దూబేను పక్కకు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో తెలుగోడు నితీష్ బరిలో ఉండే చాన్సులు కనిస్తున్నాయి. నమన్ ధీర్ స్థానంలో రవి, మయాంక్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ వస్తారని తెలుస్తోంది. రెండో టీ20లో బౌలింగ్ దళం విఫలమైన తరుణంలో ఈ మార్పులకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.