కఠిన పోరుకు సిద్ధమైన భారత షట్లర్లు

డెన్మార్క్ ఓపెన్‌లో సాత్విక్–చిరాగ్, గాయత్రి–ట్రీసా జోడీలు తొలి రౌండ్‌లో బరిలోకి దిగనున్నాయి. సెమీఫైనల్స్ అక్టోబర్ 17న, ఫైనల్స్ 18న జరగనున్నాయి.
Denmark Open Super 750 Badminton
Denmark open super 750 badminton tournament
Published on: 

కోపెన్​హాగెన్​: భారత షెట్లర్లు మరో పోరుకు సిద్ధమయ్యారు. మంగళవారం ఆరంభమయ్యే డెన్మార్క్​ సూపర్​ 750 పోటీల్లో తలపడనున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ పోటీల్లో పీవీ సింధు, లక్ష్యసేన్​, కిదాంబి శ్రీకాంత్​, చిరాగ్​, సాత్విక్​ రాజ్​ లాంటి భారత టాప్​ సీడ్స్​ పాల్గొంటున్నారు. కొద్దికాలంగా తన గేమ్​లో వెనుకబడ్డ స్టార్​ ప్లేయర్​ పీవీ సింధుకు ఆరంభంలోనే కఠిన సవాల్​ ఎదురుకానుంది. సింగిల్స్​ మొదటి రౌండ్​లోనే ఆమె ప్రపంచ నంబర్​ వన్​ ర్యాంకర్ ఆన్​ సియాంగ్​(కొరియా)ను ఢీకొననుంది. సియాంగ్​తో ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచుల్లో సింధు ఒక్కదాంట్లో కూడా గెలవలేకపోయింది. ఇక లక్ష్యసేన్​ మూడో సీడ్​ చౌ టియెన్​ చెన్​(చైనీస్​ తైపీ)​తో తలపడనున్నాడు. ఈ టోర్నీ మాజీ విజేత కిదాంబి శ్రీకాంత్​ అర్నాడ్​ మార్కిల్​(ఫ్రాన్స్)తో పోటీని ప్రారంభించనున్నాడు. పురుషుల డబుల్స్​లో సాత్విక్​–చిరాగ్​ జోడీ ఐదో సీడ్​ హే జీ టింగ్​–రెన్​ జింగ్​ యుతో పోటీ పడనున్నారు. మహిళల డబుల్స్​లో గాయత్రి గోపీచంద్​–ట్రీసా జోలీ జోడీ చైనీస్​ తైపీకి చెందిన యెన్​ ఫెయ్​ చెన్​–సెయ్​ పెయ్​ షాన్​, మరో జోడీ రుతపర్ణ–శ్వేతపర్ణ చైనాకు చెందిన ఆరో సీడ్​ పాడా–బావ్​ లి జింగ్​తో అమీతుమీ తేల్చుకోనుంది. ఒడెన్స్​ నగరంలో జరిగే ఈ పోటీల్లో అక్టోబర్​ 17న సెమీ ఫైనల్స్​, 18న ఫైనల్స్​ జరగనున్నాయి. భారత అభిమానులు ఈ మ్యాచ్​లను ఫ్యాన్​కోడ్​ యాప్​లో లేదా, వెబ్​సైట్​లో వీక్షించవచ్చు.