11 ఏళ్ల మెస్సీ రికార్డు బద్దలు

అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ 11 ఏళ్ల రికార్డును ఎంబాపే బ్రేక్ చేశాడు.
Kylian Mbappe
Kylian Mbappe Breaks Lionel Messi's Champions League History
Published on: 

ప్రభాత ఉదయం, లండన్:  రియల్ మాడ్రిడ్ స్టార్ స్ట్రైకర్ కైలియన్ ఎంబాపే సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. 27 ఏళ్లలోనే యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్‌లో 100 మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. ఈ తరుణంలోనే అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ 11 ఏళ్ల రికార్డును ఎంబాపే బ్రేక్ చేశాడు.

రోమా జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగి, ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇదే మ్యాచ్‌లో ఓ అద్భుతమైన గోల్ సాధించి, యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన టాప్-5 ప్లేయర్ల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ తరుణంలోనే రౌల్ గొంజాలెజ్ రికార్డును ఎంబాపే కూడా అధిగమించాడు.

మెస్సీ రికార్డు ఎలా బద్దలైంది ?

2015 సెప్టెంబర్‌లో 28 ఏళ్ల 84 రోజులున్న మెస్సీ, తన 100వ చాంపియన్స్ లీగ్ మ్యాచ్ ఆడి అప్పట్లో రికార్డు సృష్టించాడు. అదే రికార్డును తాజాగా 27 ఏళ్ల 298 రోజుల వయసులోనే  ఎంబాపే బద్దలు కొట్టడం గమనార్హం.