'ముంబై'కి జయవర్ధనే బై బై

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త కోచ్ ఎంపికపై యాజమాన్యం దృష్టి సారించింది.
Mahela Jayawardene Resignation
Mumbai Indians Head Coach Mahela Jayawardene Resigns
Published on: 

ప్రభాత ఉదయం,  స్పోర్ట్స్: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే రాజీనామా చేశారు. గత రెండు సీజన్లలో ముంబై పేలవమైన ప్రదర్శన కనబరిచిన క్రమంలోనే ప్రక్షాళన చేసే దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోంది. హార్ధిక్ పాండ్యాను తప్పించి, రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్సీ ఇస్తారనే చర్చ ఇప్పటికే మొదలైంది. ఇంతలోనే జయవర్ధనే రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. దీంతో అంబానీ అండ్ కో బలవంతంగా అతనితో రాజీనామా చేయించినట్టు ప్రచారం సాగుతోంది. కాగా, 2017, 2019, 2020 సీజన్లలో కోచ్‌గా సేవలు అందించి, ముంబైకి మూడు ట్రోఫీలు అందించడంలో జయవర్ధనే కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత అనివార్య కారణాలతో ముంబై నుంచి వైదొలిగాడు. మళ్లీ 2024 నుంచి 2026 వరకు ముంబై కోచ్‌గా పనిచేసి తాజాగా రాజీనామా చేశాడు.

ముంబై కోచ్ రేసులో ఐదురుగు ?

జయవర్ధనే తప్పుకున్న తరుణంలో ముంబై ఇండియన్స్, కొత్త కోచ్‌ను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ క్రమంలో ఆరోన్ ఫించ్, బిరెల్, బౌచర్, మోర్గాన్, మైఖేల్ హస్సీ రేసులో ఉన్నట్టు తెలిసింది. ఆదివారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్టు సమాచారం.