అభిషేక్ శర్మ కోట బద్దలు

శ్రీలంకపై మూడు టీ20ల్లో 238 పరుగులు చేసిన సాహిబ్జాదా ఫర్హాన్.. మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.
Sahibzada Farhan
Sahibzada Farhan creates new record in his first bilateral T20I series as Pakistan captain
Published on: 

ప్రభాత ఉదయం, స్పోర్ట్స్ డెస్క్ : పాక్ టీ20 కొత్త కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ పూర్తిస్థాయి సభ్య దేశాల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ తరుణంలోనే టీమిండియా డేంజరస్ ప్లేయర్ అభిషేక్ శర్మ రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేశాడు.  శ్రీలంక, పాక్ మధ్య జరిగిన మూడు టీ20లలో వరుసగా మూడు అర్ధ సెంచరీలు నమోదు చేసి మొత్తంగా 238 పరుగులు సాధించి, అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గతంలో ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన 3 టీ20లలో అభిషేక్ వర్మ 229 పరుగులు సాధించాడు. తాజాగా లంకపై అద్భుతంగా రాణించి, ఆ రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అభిషేక్‌కు ఎసరు

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ లిస్టులోనూ 883 రేటింగ్స్‌తో ఫర్హాన్ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. ప్రస్తుతం 891 రేటింగ్స్‌తో రెండో స్థానంలో అభిషేక్ శర్మ కొనసాగుతున్నాడు. అయితే, మరో అర్థ సెంచరీ చేస్తే కచ్చితంగా అభిషేక్ శర్మను దాటేసి రెండో స్థానానికి ఫర్హాన్ వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి తరుణంలో విండీస్‌తో జరుగనున్న మిగిలిన రెండు టీ20లలో అభిషేక్ శర్మ బాగా రాణిస్తే, ఫర్హాన్ రూపంలో వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. ఒకవేళ అభిషేక్ సెంచరీ చేస్తే, తొలి స్థానంలో ఉన్న ఇషాన్ కిషన్‌ను వెనక్కి నెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.