కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు శ్రేయస్‌

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ కెరీర్ బెస్ట్ నాలుగో స్థానానికి చేరుకోగా, తిలక్ వర్మ తొమ్మిదో ర్యాంకును అందుకున్నాడు.
Shreyas Iyer
Shreyas Iyer
Published on: 

ప్రభాత ఉదయం, స్పోర్ట్స్: పొట్టి ఫార్మాట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీ20లలో కెరీర్ బెస్ట్ ర్యాంకును అందుకున్నాడు. విండీస్‌తో జరుగుతోన్న 5 టీ20ల సిరీస్‌లో అదరగొడుతున్న సర్పంచ్ సాబ్, తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి 798 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. లక్నో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తొలి టీ20 సెంచరీ సాధించి, ర్యాంకింగ్స్‌లో మెరుగుపడ్డాడు. ఇషాన్ కిషన్ 904 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, అభిషేక్ శర్మ, ఫర్హాన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఒక స్థానం మెరుగుపడి 9వ స్థానానికి చేరుకున్నాడు. ఓవరాల్‌గా టాప్ 10లో టీమిండియా బ్యాటర్లే నలుగురు ఉన్నారు.

పడిపోయిన బుమ్రా, అక్షర్ పటేల్ ర్యాంకింగ్స్

టీమిండియాపై అదరగొడుతున్న విండీస్ ఆటగాడు రోస్టర్ చేజ్ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 24 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలోనూ రెండు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకును దక్కించుకున్నాడు. విండీస్ సిరీస్‌కు దూరమైన బుమ్రా 11వ స్థానానికి పడిపోయాడు.  విండీస్‌పై పెద్దగా రాణించలేకపోతున్న అక్షర్ పటేల్ 9వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొన్నటి వరకు టాప్ బౌలర్‌గా కొనసాగిన వరుణ్ చక్రవర్తి, 15వ స్థానానికి పడిపోయాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా 422 పాయింట్లతో తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సౌతాఫ్రికాపై అత్యున్నత ప్రదర్శన కనబరిచిన ఆసీస్ బ్యాటర్ మాథ్యూ రెన్ షా 49వ స్థానానికి దూసుకొచ్చాడు.