

· పాకిస్తాన్‌పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విక్టరీ
· ఇంటి దారిపట్టిన ఇంగ్లాండ్
లాహోర్: వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా మొన్న ఇంగ్లాండ్‌పై విరోచిత పోరాట చేసి గెలిచిన పాకిస్తాన్, మంగళవారం శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిపోయింది. లాహోర్ గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన కీలక వన్డేలో పాకిస్తాన్‌పై శ్రీలంక ఏకంగా 8 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. పాకిస్తాన్ విధించిన 110 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు నష్టపోయిన శ్రీలంక, 17 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేసింది. లంక ఓపెనర్ కమిండు మెండిస్ 62 పరుగులతో రాణించి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. మెండిస్‌కు తోడుగా పవన్ రత్ననాయకే 23 పరుగులతో మెరిసాడు. ఈ క్రమంలో ట్రై సిరీస్ టేబుల్‌లో 4 పాయింట్లకు చేరిన లంక ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో ఇంగ్లాండ్ ఇంటి దారి పట్టింది.
ట్రై సిరీస్ ఫైనల్ ఎప్పుడంటే?
వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్ లంక, పాక్ మధ్య అక్టోబర్ 31వ తేదీన జరుగనుంది. ఈ మ్యాచ్ లాహోర్ గడాఫీ స్టేడియం వేదికగానే నిర్వహించనున్నారు. ఇందులో గెలిచిన టీమ్, సిరీస్ కైవసం చేసుకోనుంది. కాగా, లీగ్ దశలో లంక, ఇంగ్లాండ్ మధ్య అక్టోబర్ 29న నామమాత్రపు వన్డే జరుగనుంది.