బౌన్సర్లతో చంపేస్తారా ?

Sunil Gavaskar slams Shamar Joseph
Sunil Gavaskar slams West Indies pacer Shamar Joseph over Arshdeep Singh injury
Published on: 

ప్రభాత ఉదయం, స్పోర్ట్స్:  విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ బౌలింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ప్రమాదకరమైన బౌన్సర్లు వేసి, ప్లేయర్లను చంపేస్తారా? అంటూ ఆగ్రహించారు. టీమిండియా, విండీస్ ఉప్పల్ మ్యాచ్ సందర్భంగా అర్ష్‌దీప్‌ సింగ్‌ భుజానికి గాయం కావడంపై సునీల్ గవాస్కర్ సోషల్ మీడియా వేదికగా గురువారం స్పందించారు. విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ కావాలనే బౌన్సర్లు వేసి అర్ష్‌దీప్‌ను గాయపరిచాడని ఆగ్రహించారు. టార్గెట్ చేసి అర్ష్‌దీప్‌ను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. నిజంగానే షమర్ బౌలింగ్‌లో దమ్ముంటే, వికెట్లను టార్గెట్‌గా చేసుకుని బౌలింగ్ చేయాలని చురకలు అంటించారు. ఆ బంతులే తలకు తగిలింటే, పరిస్థితి ఏంటో ఆలోచించారా ? విండీస్ కెప్టెన్ హోప్‌కైనా సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యూహాలు రెజ్లింగ్‌లో పనికి వస్తాయని, క్రికెట్‌లో ప్రయోగిస్తే ఎవరూ హర్షించబోరని కౌంటర్ ఇచ్చారు.

అర్ష్‌దీప్‌ రిటైర్డ్ హర్ట్..ఇన్నింగ్స్ డిక్లేర్డ్

షమర్ జోసెఫ్ బౌన్సర్ల దెబ్బకు గాయపడిన అర్ష్‌దీప్‌ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఈ తరుణంలోనే 3 బంతులు ఉండగానే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో టీమిండియాపై 24 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించి, సిరీస్‌ను 2-2 తేడాతో సమం చేసింది. కాగా అర్ష్‌దీప్‌ గాయం తీవ్రమైతే, చివరి టీ20కి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇదే జరిగితే, భువనేశ్వర్‌ను తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.