టీమిండియా స్పీడ్‌కు బ్రేకులు

వరుసగా మూడు విజయాల తర్వాత టీమిండియాకు ఓటమి ఎదురైంది. ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ 87 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
Glenn Phillips
గ్లెన్ ఫిలిప్స్
Published on: 

·       కివీస్ చేతిలో 87 పరుగల తేడాతో పరాజయం 

·       టీ20ల్లో భారత్‌కు రెండో అతిపెద్ద ఓటమి

ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా మూడింటిలో గెలిచిన అయ్యర్ సేన, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బరిలో దిగి 4వ టీ20లో చిత్తుగా ఓడింది. మొదటి మూడు మ్యాచ్‌లలో ఓడిన కివీస్, ఆక్లాండ్‌లో మాత్రం కసిగా ఆడింది. ఈ దెబ్బకు న్యూజిలాండ్ చేతిలో 87 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ సమీకరణం 3-1గా మారింది. ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ హామిల్టన్ వేదికగా నవంబర్ 1వ తేదీన జరుగనుంది.

రఫ్ఫాడించిన డఫ్పీ, సెంచరీతో చెలరేగిన ఫిలిప్స్

టీమిండియా, కివీస్ మధ్య ఆక్లాండ్ వేదికగా శుక్రవారం నామమాత్రపు నాలుగో టీ20 జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ సెంచరీతో ఇరగదీశారు. కేవలం 49 బంతుల్లో 107 పరుగులు సాధించి, టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ తరుణంలోనే  కివీస్ భారీ స్కోర్ సాధించింది.

ఇక టార్గెట్ ఛేదించే క్రమంలో అయ్యర్ సేన తేలిపోయింది. టాప్, మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులే చేసింది. దీంతో న్యూజిలాండ్ చేతిలో 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫ్ఫీ ఈ మ్యాచ్‌లో రఫ్ఫాడించాడు. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి, 4 కీలక వికెట్లు తీశాడు. ఫిషర్, శాంట్నర్ తలో రెండు వికెట్లు తీయగా, ఆడమ్ మిల్నే ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసి  గ్లెన్ ఫిలిప్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.

గంభీర్ నిర్ణయాలే టీమిండియా కొంపముంచాయా?

నాలుగో టీ20లో టీమిండియా ఓటమికి కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలే కారణమంటూ చర్చ నడుస్తోంది. మూడో టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుంటే, భారత్ గెలిచేదని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అనవసరంగా వైభవ్‌ను పక్కకు పెట్టాడని, దీంతో బ్యాటింగ్ ఆర్డర్ డిస్టర్బ్ అయిందని మండిపడుతున్నారు.