యాదగిరిగుట్టలో ‘గిరి ప్రదక్షిణ’

యాదగిరిగుట్టలో వేద విద్వాన్ మహాసభల సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణలో దాదాపు 800 మంది వేదపండితులు, విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.
800 Vedic Scholars and Students Perform Giri Pradakshina at Yadagirigutta
యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ నిర్వహించిన వేదపండితులు, భక్తులు
Published on: 

ప్రభాత ఉదయం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న యాదగిరికొండ చుట్టూ శనివారం వేకువజామున ‘గిరి ప్రదక్షిణ’ నిర్వహించారు. ‌ వేద విద్వాన్ మహాసభల సందర్భంగా జనార్దానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 800 మంది వేదపండితులు, వివిధ వేద పాఠశాలలకు చెందిన విద్యార్థులు, భక్తులు  పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల ధ్వనులతో యాదగిరిగుట్ట పరిసరాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. సనాతన వేద సంప్రదాయాలు,  ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంతోపాటు ప్రజల్లో ధార్మిక చైతన్యాన్ని పెంపొందించే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. గిరి ప్రదక్షిణ అనంతరం కాలినడకన కొండపైకి వెళ్లి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని తరించారు.