అమిత్ షాతో పలువురు ప్రముఖుల భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఐటీసీ కాకతీయలో చిరంజీవి, రామ్‌చరణ్, రామేశ్వరరావులతో భేటీ అయ్యారు.
Amit Shah meets Chiranjeevi Ram Charan in Hyderabad
హైదరాబాద్‌లో అమిత్ షాతో చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ
Published on: 

ప్రభాత ఉదయం, హైదారాబాద్​ సిటీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా నగర పర్యటన ఆసక్తికరగా సాగింది. ఉదయం దిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్​ బేగంపేట విమాశ్రయానికి వచ్చిన షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​ రావుతోపాటు కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్​ నేతలు ఘన స్వాగతం పలికారు.  అక్కడి నుంచి నేరుగా కాకతీయ హోటల్​‌కు చేరుకున్నారు. అటూ నుంచి చార్మినార్​ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. అమ్మవారి సందర్శన అనంతరం ఎక్స్​ వేదికగా స్పందించారు. భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పూజలు చేయడం  నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో  ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ఆ లక్ష్మిదేవిని మనసారా ప్రార్ధించాను అని ట్వీట్​ చేశారు. అనంతరం షా ఐటీసీ కాకతీయ హోటల్​‌కు వచ్చారు. హోటల్​లో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖలతో ఆయన భేటీ అయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త మై హోం జూపల్లి రామేశ్వరరావుతోనూ, ఎన్​టీవీ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరితో భేటీ అయ్యారు. ప్రముఖ సినీ నటుడు, గత కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్​‌తో సమావేశం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మరింది. అదేవిధంగా గతంలో షా హైదరాబాద్​‌కు వచ్చిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్, నితిన్​‌లను కలిసిన విషయం తెలిసిందే.