హరీశ్‌రావుకు షోకాజ్ నోటీసు పంపలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్

మాజీ మంత్రి హరీశ్‌రావుకు తాను షోకాజ్ నోటీసు పంపినట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఖండించారు.
Harish Rao BRS
Harish Rao
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్:  మాజీ మంత్రి హరీశ్‌రావుకు తాను షోకాజ్ నోటీసు పంపినట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఖండించారు. తాను హరీశ్‌రావుకు షోకాజ్ నోటీసు ఇవ్వలేదని, తన పేరుతో ప్రచారంలో ఉన్న నోటీసు నకిలీదని ఆయన స్పష్టం చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ షోకాజ్ నోటీసును సృష్టించారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమ భరత్ కుమార్ ఈవివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతా నుంచి ఈ నకిలీ నోటీసు ప్రచారంలోకి వచ్చిందన్నారు. దీనిపై క్రిమినల్ కేసు పెడతానని ఆయన ప్రకటించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.