‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ : సీఎం రేవంత్ రెడ్డి

‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో ఈ ఏడాది పండుగ జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. లబ్ధిదారుల ఇండ్లలో దీపాలు వెలిగించి వారితో పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు.
CM Revanth Reddy announcing Maa Indiramma Intlo Diwali celebrations
సీఎం రేవంత్ రెడ్డి
Published on: 

సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ ఏడాది దీపావళి వేడుకలను ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో వినూత్నంగా నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంతో సొంతింటి కల నెరవేరిన లబ్ధిదారుల ఇండ్లలో దీపాలు వెలిగించి వారితో కలిసి పండుగ జరుపుకోవాలని మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పార్టీ శ్రేణులకు ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. తాను సైతం ఇందిరమ్మ ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో వారి సొంతింటి సంతోషంలో పాలుపంచుకుని దీపావళి పండుగ జరుపుకోనున్నట్లుగా తెలిపారు.