అభివృద్ధి పనులపై సీఎం ప్రత్యేక దృష్టి

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
Vemulawada Temple Development
Vemulawada Temple Development
Published on: 

ప్రభాత ఉదయం, వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణ పనులు చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం తదితర నిర్మాణ పనులపై హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ గరిమ అగర్వాల్, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, ముఖ్యమంత్రి ఓఎస్డీ సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్‌లో రద్దీ ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ప్రతి అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.