

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ నెలాఖరున రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. గురువారం మంత్రిమండలి సమావేశం సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం బ్యారేజీలు దెబ్బతిన్న తరువాత మూడేళ్లుగా చేస్తున్న మరమ్మతు పనులను అసెంబ్లీలో వివరించాలని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పకొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు పరీవాహక జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు గోదావరిని సందర్శించాలని సీఎం సూచించారు. గోదావరి నుంచి నీటి ప్రవాహం, ఎత్తిపోతల పరిస్థితులను వెల్లడిస్తే ప్రజలకు వాస్తవం అర్థం అవుతుందన్నారు. ఈ విషయాలను గోదావరి జలాల వద్దే తెలియచేస్తే బాగుంటుందన్నారు. ఏపీకి నీళ్లు తరలించారనే ప్రచారంలో వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని సమావేశంలో రేవంత్ సూచించినట్టు తెలిసింది.