

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలు, ప్రజా సంక్షేమ విధానాలు నేటికీ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ సమగ్రత, సమైక్యత, పటిష్టత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ధీశాలి అని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె దేశానికి చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రతకు ముప్పు వాటిల్లకుండా తన ప్రాణాలనే పణంగా పెట్టి పని చేశారని కొనియాడారు. ఇందిరమ్మ చూపిన సంక్షేమ పాలన, సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతి మార్గంలోనే తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.