పారదర్శకంగా అంగన్వాడీ ఇంటర్వ్యూలు

ఉట్నూర్‌ మండలంలో 27 అంగన్వాడీ టీచర్‌ పోస్టులకు 89 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు.
Adilabad Collector Rajarshi Shah
ఇంద్రవెల్లిలో కంటి వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ రాజర్షి షా
Published on: 

ప్రభాత ఉదయం, ఉట్నూరు: అంగన్వాడీ టీచర్ల నియమానికి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. గురువారం ఆయన ఐటీడీఏ పీఓ మంద మకరందుతో కలిసి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా, శిశు సంక్షేమానికి అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకమని, వాటిని బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం టీచర్, హెల్పర్ నియామకాలను చేపట్టిందన్నారు. ఉట్నూర్ మండలంలో 27 టీచర్ పోస్టులకు అర్హత సాధించిన 92 మందిలో 89 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, ముగ్గురు గైర్హాజరయ్యారని వివరించారు. ఈ ప్రక్రియలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీడబ్ల్యూఓ మిల్కా, డీఎంఎచ్ఓ డాక్టర్​ సాధన, సీడీపీఓలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని నాగోబా విద్యార్థి నిలయంలో హైదరాబాద్​కు చెందిన శంకర నేత్రాలయ, వనవాసీ కల్యాన్​ పరిషత్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యం మెరుగ్గా ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చన్నారు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా  వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్​ ప్రణయ్​ కుమార్​, వనవాసీ కల్యాణ్ పరిషత్ కార్యకర్తలు వెంకటేశ్వర రావు, సిడామ్ భీమ్రావు, హెచ్.కె. నాగు, ప్రకాష్, అజయ్, శంకర నేత్రాలయ కో ఆర్డినేటర్ రాజు, వైద్యులు, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.